dayagala hrudayudavu

దయగల హృదయుడవు
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును

“దయగల”

1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము            2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో  2

2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము      2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2

3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము       2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును