idhigo devaa na jeevitham

ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీకంకితం

శరణం నీ చరణం – శరణం నీ చరణం (2X) ||…ఇదిగో… ||

1. పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి

విలువైన నీ దివ్య పిలుపుకు – తగినట్లు జీవించనైతి (2X)

అయినా నీ ప్రేమతో – నన్ను దరి చేర్చినావు

అందుకే గైకొనుమో దేవా – ఈ నా శేష జీవితం ||…ఇదిగో… ||

2. నీ పాదముల చెంతచేరి – నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి – ప్రార్దించి పనిచేయ నేర్పు (2X)

ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పని చేయనిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము ||…ఇదిగో… ||

3. విస్తార పంట పొలము నుండి – కష్టించి పనిచేయనిమ్ము

కన్నీటితో విత్తు మనస్సు – కలకాలం మరినాకు నొసగు (2X)

క్షేమక్షామ కాలమైనా – నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా

నశియించు ఆత్మలన్ – నీదరి చేర్చు కృపనిమ్మయా ||…ఇదిగో… ||