kalvari swaramu nee korake

కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము
సా. . సగరిగ. . సానీ. . పా. . మా గమపా. .

1. సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో
చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము

2. గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను
ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వరలకెల్లా
సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము

3. మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక
నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము