kurchundunu nee sannidhilo

kurchundunu nee sannidhilo song lyrics in Telugu

దొకూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం |2|
నిరంతరం నీ నామమునే గానము చేసెదను

ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును నీ సన్నిధిలో||
1. ప్రతి విషయం నీకర్పించెద, నీ చిత్తముకై నే వేచెద |2|
నీ స్ఫూర్తినే పొంది నే సాగెద|2| నీ నామమునే హెచ్చించెద |2|
నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే, నా ఆధారము నీవే
యేసు యేసు, యేసు యేసు ||కూర్చుందును నీ సన్నిధిలో||

2. ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెద |2|
నీ వాక్యానుసారము జీవించెద |2| నీ ఘన కీర్తిని వివరించెద |2|
నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే
యేసు యేసు, యేసు యేసు ||కూర్చుందును నీ సన్నిధిలో||

Source from: https://www.youtube.com/watch?v=jmkkp6In_Ps