nadipistaadu naa devudu

నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)

1. అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

2. కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

3. నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు