ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2

నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2

1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2

అంగీకరించుము నా సమర్పణ

2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు – అంధకార ఛాయలను తొలగించుటకు – 2

అంగీకరించుము నా సమర్పణ