Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

athisundarudavu neevu

అతికాంక్షణీయుడా నా యేసయ్యా
నీకే వందనము నా యేసయ్యానీకే వందనము
నీవే పూజ్యనీయుడవు స్తోత్రార్పడవు
నీవే కీర్తనీయుడవు పరిపూర్ణుడవు
నీకే స్తోత్రమయా నా యేసయ్యానీకే స్తోత్రమయా
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదను
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదను

నీ రక్తధారలతో వెలయిచ్చికొన్నావె
నీ శ్రేష్ట ప్రేమతో నన్ను పిలుచుకున్నావే 2
నీ బలియాగమే నన్ను విమోచించెనే
సిలువ త్యాగమే నాకు విలువనిచ్చెనే 2

ఆదరణ లేని నాకు అండగా నిలిచావే
నీ పరిపూర్ణతలో నన్ను మార్చుకున్నావే 2
నీ రాజ్యనియమాలలో నన్ను నిలువనిచ్చావే
నీ సంకల్పమే నెరవేర్చుకున్నావే 2

నిరీక్షణ లేని నాకు నిత్యజీవమిచ్చావే
నిత్యత్వములోనికి నన్ను చేర్చుకున్నావే 2
నిత్య నిబంధన నాతో చేసావే 2
నీతి సూర్యునితో నన్ను స్థిరపరచావే