గాచున్ నిను గాచున్ గాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును
దిగులేల మనసా కాపాడును
వెదకి నిన్ పిలచిన కరమును చూడు నిన్ చెయి విడువదెన్నడు
కలకాలమాయన నీకై నిచ్చిన ఈవుల నెంచి చూడుము>
ఈవులన్ ఎంచుము నీవు ఎంచి మరిచూడుము ” గాచున్ ”
ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా
వారినిప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదనలేదా
లేదా .. లేదా .. ప్రభు సంతాపమెంద లేదా ” గాచున్ ”
పడిపోయిన నిన్ను విమోచించియు మరి దరిచూపి చేర్చువాడు
కొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడు
జయము… ఘనతా… సుఖము …. నీకెప్పుడిచ్చెడివాడు ” గాచున్ “