naa praana priyudaa Yesu Raajaa

నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్
విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా
రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును
నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా
వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా