నా యెడల నీకున్న తలంపులన్ని (2)
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)
అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)
నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల||
రాజువైన నీవు దాసుడవయ్యావా
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)
అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)
పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు
నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా
దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2)
ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2)
సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2)
నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా
బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2)
నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2)
నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు
నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.