nannenthaga preminchithivo

నన్నెంతగా ప్రేమించితివో…
నిన్నంతగా దూషించితినో…

నన్నెంతగా నీవెరిగితివో…
నిన్నంతగా నే మరచితినో…

గలనా… నే చెప్పగలనా…
దాయనా … నే దాయగలనా… (2)
అయ్యా… నా యేసయ్యా…

నాదం… తాళం… రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము… (2)

1. ఏ రీతిగా నా ఉదయమును … నీ ఆత్మతో దీవించితివో…
ఏ రీతిగా నా భారమును … నీ కరుణతో మోసితివో … (2)

ఏ రీతిగా నా పలుకులో … నీ నామమును నిలిపితివో…
ఏ రీతిగా నా కన్నీటిని …. నీ ప్రేమతో తుడిచితివో … (2) || గలనా ||

2. ఏ రీతిగా నా రాతను … నీ చేతితో రాసితివో…
ఏ రీతిగా నా బాటను… నీ మాటతో మలిచితివో… (2)

ఏ రీతిగా నా గమ్యమును … నీ సిలువతో మార్చితివో…
ఏ రీతిగా నా దుర్గమును … నీ కృపతో కట్టితివో… (2) || గలనా ||