Sainyamulaku adhipathi song lyrics in telugu
పల్లవి :- సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి ప్రియమైన దేవా యేసయ్య నీకే నా స్తోత్రము ఘనమైన రాజా యేసయ్య నీకే నా వందనం (2) నీకే నా స్తోత్రము – నీకే నా వందనం నీ వాక్యమే ఇల నా జ్ఞానము నీ రక్తమే ఇల నా జీవము (2) చరణం :- 1 నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోరు మూయించినావు (2) వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును నాకింక దిగులేలను (2) (సైన్యములకు అధిపతి) చరణం :- 2 పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను (2) విశ్వాసముతో విజయాలను నిత్యము నే పొందిద నీతోనే నిలిచేద (2) (సైన్యములకు అధిపతి) చరణం :- 3 పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను (2) దీనుడనై నేను నీయందే అతిశయించెదను – ఆనందించెను (2) (సైన్యములకు అధిపతి)
