నేడు ఇక్కడ రేపు ఎక్కడో Telugu Christian Songs Lyrics

నేడు ఇక్కడ రేపు ఎక్కడో
తెలియని పయనం ఓ మానవా (2)
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు||

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు||

అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట (2)
దిగంబరిగానే నీవు పుడతావు
దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||

నేడు ఇక్కడ రేపు ఎక్కడో Jesus Songs Lyrics in Telugu