ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్) Telugu Christian Songs Lyrics

ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా
మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం||

మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ (2)
పరులకు లెక్కెంతయ్యా
అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా
అల్పునకు ||ఆధారం||

నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు (2)
నడి యేట వీడిరయ్యా
ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా
ఏకాంతునకు ||ఆధారం||

శోధనలెగసి – వేదన వెన్నంటి (2)
దుఃఖం పొంగే వేళలో
నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో
నీ దాసునకు ||ఆధారం||

విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం (2)
నిండు కృపానిధియే
నా విభుడా.. నిండు కృపానిధియే
నా విభుడా ||ఆధారం||

ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్) Jesus Songs Lyrics in Telugu


ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్) Telugu Christian Songs Lyrics