ఆకాశమే పట్టనోడు Telugu Christian Songs Lyrics

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు(2)
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే|| ||ఆకాశమే||

ఆకాశమే పట్టనోడు Jesus Songs Lyrics in Telugu


ఆకాశమే పట్టనోడు Telugu Christian Songs Lyrics