అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||
దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు (2)
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||
గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||