చీకటినే తొలగించినది Telugu Christian Songs Lyrics

ప్రేమా … ప్రేమా…
యేసూ… నీ ప్రేమా (2)

చీకటినే తొలగించినది
లోకమునే వెలిగించినది
మరణము గెలిచి మార్గము తెరచినది
పాపిని నను ప్రేమించినది
వెదకి నను రక్షించినది
నీతిమంతునిగా ఇల మార్చినది

యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా
కృపతోనే రక్షించి కాపాడితివయ్యా

ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
ఈ స్తోత్రార్పణ నీకే

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||చీకటినే||

దేవా… నా దేవా…
దేవా… నా ప్రభువా (2)

నీ కొరకే నే బ్రతికెదను
నీ ప్రేమను కనుపరచెదను
నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా
నీ సువార్తను చాటెదను
నిన్నే నే కీర్తించెదను
నీ సేవలో నే కొనసాగెదనయ్యా

యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా
నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా
యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా
నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా

ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
ఈ స్తోత్రార్పణ నీకే

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||నీ కొరకే||

చీకటినే తొలగించినది Jesus Songs Lyrics in Telugu


చీకటినే తొలగించినది Telugu Christian Songs Lyrics