ఈ మరణము కాదు Telugu Christian Songs Lyrics

ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥

జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥

యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥

కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥

ఈ మరణము కాదు Jesus Songs Lyrics in Telugu


ఈ మరణము కాదు Telugu Christian Songs Lyrics