ఎనలేని ప్రేమ Telugu Christian Songs Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా (2)
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని||

కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా (2)
చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా||

ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా (2)
పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా||

ఎనలేని ప్రేమ Jesus Songs Lyrics in Telugu


ఎనలేని ప్రేమ Telugu Christian Songs Lyrics