గాడాంధకారపు లోయలో Telugu Christian Songs Lyrics

గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు||

పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు||

నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి(2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||

గాడాంధకారపు లోయలో Jesus Songs Lyrics in Telugu


గాడాంధకారపు లోయలో Telugu Christian Songs Lyrics