కానరావే అలనాటి కన్నీటి Telugu Christian Songs Lyrics

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
కదలవేమి అపవాది చెరసాల పునాదులు
ఇది నీ లోపమా – మరి నా లోపమా
యోచించుమా క్రీస్తు సంఘమా (2)
యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే||

సమూయేలుల నందించే హన్నాలేరి
సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2)
నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2)
నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో
కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా||

అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి
ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2)
శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2)
శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో
దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా||

నిద్ర లేవాలి ఓ సంఘమా
అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా
క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా
ఉజ్జీవం నీలో నిండాలి
ఓ సంఘమా… నిజ సంఘమా

కానరావే అలనాటి కన్నీటి Jesus Songs Lyrics in Telugu


కానరావే అలనాటి కన్నీటి Telugu Christian Songs Lyrics