కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా (2)
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2)
విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం (2)
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన||
వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా (2)
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా (2)
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||