కన్నీళ్లతో పగిలిన గుండెతో Telugu Christian Songs Lyrics

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను

రాతిరంత ఏడుపొచ్చినా –కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా –వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా –పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా –అనాథగా నిన్ను చేయునా ||విడువడు||

అంధకారమడ్డు వచ్చినా –సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా –క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా –బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా –గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||

కన్నీళ్లతో పగిలిన గుండెతో Jesus Songs Lyrics in Telugu


కన్నీళ్లతో పగిలిన గుండెతో Telugu Christian Songs Lyrics