krupalanu thalanchuchu

కృపలను తలంచుచు – ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్

మిమ్మును ముట్టినవాడు – నా కంటి పాపను
ముట్టునని సెలవిచ్చిన దేవుడు – కాచెను గతకాలం నన్ను

రూపింపబడుచున్న – ఏ ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదుయని – చెప్పిన మాట సత్యం ప్రభువు

కన్నీటి లోయలలో – నే కృంగిన వేళలో
నింగిని చీల్చి వర్షము పంపి – నింపెను నా హృదయం! యేసు

సర్వోన్నతుడైన – నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయు – స్తుతులతో నింపెను యిలలో

హల్లెలూయ ఆమేన్ – ఆ…, నాకెంతొ ఆనందమే
సీయోన్ నివాసం – నాకెంతొ ఆనందం – ఆనందమానందమే – ఆమేన్