నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని||
కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)
నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని||
దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)
నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని||
పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)
నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||