నా స్నేహితుడా Telugu Christian Songs Lyrics

నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
నా స్నేహితుడా… నా యేసయ్యా (2)
విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో||

నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా
లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా
ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||

నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా
కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా
అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా
ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా
ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||

నా స్నేహితుడా Jesus Songs Lyrics in Telugu


నా స్నేహితుడా Telugu Christian Songs Lyrics