నీవేయని నమ్మిక Telugu Christian Songs Lyrics

నీవేయని నమ్మిక
యేసు నాకు.. నీవేయని నమ్మిక
నీవే మార్గంబు – నీవే సత్యంబు
నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే||

పెడదారిని బోవగ
నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ
తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే||

కారు మేఘము పట్టగ
నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ
తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే||

లేనిపోని మార్గంబు
లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు – వానిని ఖండించి
నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే||

నరలోకమునుండి
పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి
సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే||

నీవేయని నమ్మిక Jesus Songs Lyrics in Telugu


నీవేయని నమ్మిక Telugu Christian Songs Lyrics