పసి బాలుడై Telugu Christian Songs Lyrics

పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు

రండి రండి నేడు బెత్లహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజునొద్దకు
రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు ||పసి బాలుడై||

యేసు రాజు పుట్టేనని హల్లేలూయా
గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
నిజ రక్షకుడు అని హల్లేలూయా
ఆరాధించెదము హల్లేలూయా ||రండి||

ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా
రాజులకు రాజు హల్లేలూయా
ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా ||రండి||

పసి బాలుడై Jesus Songs Lyrics in Telugu


పసి బాలుడై Telugu Christian Songs Lyrics