ప్రేమగల మా ప్రభువా Telugu Christian Songs Lyrics

ప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల||

నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల||

అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల||

బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2) ||ప్రేమగల||

తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల||

మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||

ప్రేమగల మా ప్రభువా Jesus Songs Lyrics in Telugu


ప్రేమగల మా ప్రభువా Telugu Christian Songs Lyrics