Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సంతోషించుడి యందరు Telugu Christian Songs Lyrics

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి||

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి||

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి||

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి||

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి||

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము
వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||

సంతోషించుడి యందరు Jesus Songs Lyrics in Telugu


సంతోషించుడి యందరు Telugu Christian Songs Lyrics