Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

సరి చేయుమో దేవా – Sari Cheyumo Devaa Lyrics

Telugu Christian Songs Lyrics ·

Language
Telugu
Collection
Telugu Christian Songs Lyrics

సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా (2)
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా (2) ||సరి||

దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను (2)
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి (2)
బ్రతిమాలుచున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||

నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు (2)
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము (2)
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||

సరి చేయుమో దేవా – song video