సీయోనులో స్థిరమైన Telugu Christian Songs Lyrics

నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||

కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||

సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)

సీయోనులో స్థిరమైన Jesus Songs Lyrics in Telugu


సీయోనులో స్థిరమైన Telugu Christian Songs Lyrics