సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ