సిలువను గెలిచిన సజీవుని త్యాగము
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)
ముందే తెలియును – తన బలియాగము
తెలిసే చేసెను స్వ బలిదానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
తననే వంచెను తనువే అర్పించెను
దేవా నీ త్యాగము మము రక్షించెను
పాపము నుండి విడిపించెను
దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||