సిలువే నా శరణాయెను రా Telugu Christian Songs Lyrics

సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువే నా శరణాయెను రా Jesus Songs Lyrics in Telugu


సిలువే నా శరణాయెను రా Telugu Christian Songs Lyrics