Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తోత్రించెదము Telugu Christian Songs Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు||

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు||

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2)
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు||

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2)
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు||

స్తోత్రించెదము Jesus Songs Lyrics in Telugu


స్తోత్రించెదము Telugu Christian Songs Lyrics