స్తుతికి పాత్రుడ యేసయ్యా Telugu Christian Songs Lyrics

స్తుతికి పాత్రుడ యేసయ్యా
నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)
పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)
నీవే నా రక్షణ –నీవే నా స్వస్థత
నీవే నా విడుదల (2) ||స్తుతికి||

పాప ఊభిలో నుండి – పైకి లేపితివి
మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)
నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ
నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే||

జీవాహారము నీవే – జీవ జలము నీవే
నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2)
ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును
యేసు రాజా నీ యెదుట (2) ||నీవే||

స్తుతికి పాత్రుడ యేసయ్యా Jesus Songs Lyrics in Telugu


స్తుతికి పాత్రుడ యేసయ్యా Telugu Christian Songs Lyrics