yenduko nannu

ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా

నీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను దేవా
హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా రాఫా
హల్లెలూయా యెహోవా షాలోం హల్లెలూయా యెహోవా షమ్మా

నాకు బదులుగా నాదు శిక్షను నీవు బరియించావు
పాతాల వేదన శ్రమల నుండి నన్ను విడిపించావు

నే క్రుంగి ఉన్న వేళలో నీవు కరుణించావు
నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందినావు

నీ బండ పైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు

పరలోక పరిచర్య బాగస్వామిగా నన్ను స్వీకరించావు