యేసయ్యా నాకంటూ Telugu Christian Songs Lyrics

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||

యేసయ్యా నాకంటూ Jesus Songs Lyrics in Telugu


యేసయ్యా నాకంటూ Telugu Christian Songs Lyrics