యేసు నామం సుందర నామం
యేసు నామం మధురం మధురం
జుంటి తేనెల కంటె మధురం
పాపములను క్షమియించు నామం
పాపములను తొలగించు నామం
స్వస్థపరచును యేసు నామము
అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)
సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
అద్వితీయ నామం – అతిశయ నామం
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)
సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||