Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

యేసుని ప్రేమ యేసు వార్త – Yesuni Prema Yesu Vaartha Lyrics

Telugu Christian Songs Lyrics ·

Language
Telugu
Collection
Telugu Christian Songs Lyrics

యేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||

మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో (2)
చితికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

యేసుని ప్రేమ యేసు వార్త – song video