Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

అందాలతార Christian Song Lyrics

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసుపయనమైతిని ||అందాలతార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాలతార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు ||అందాలతార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ||అందాలతార||

అందాలతార Jesus Songs Lyrics in Telugu


అందాలతార Telugu Christian Songs Lyrics