ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2)
అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2)
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2)
వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2)
మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2)
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే||
నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2)
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2)
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే||
వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2)
కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2)
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||