యెహోవా నిస్సీ Telugu Christian Songs Lyrics

యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ
యెహోవా నిస్సీ – అనుచు పాడెదం
మా ధ్వజము విజయ ధ్వజమే (2)
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా||

ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును
కలత చెంద కారణమే లేదుగా
సడలకుండ కరముల కాధారమై
శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)
సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా||

మనయందున్నట్టి బలము చాలును
నాధుడేసు సెలవిచ్చెను పోదము
ఆయుధములు భుజబలమవసరమా
పరమ దేవునాత్మ మనలో నుండగా (2)
మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా||

హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం
యేసు నామ శక్తే సామర్ధ్యము
యేసు రాక వరకే పోరాటము
జయము పొందుటే జీవిత ధ్యేయము (2)
సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||

యెహోవా నిస్సీ Jesus Songs Lyrics in Telugu


యెహోవా నిస్సీ Telugu Christian Songs Lyrics