జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)
2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)