లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
పరమ తండ్రితనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడైలేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా||
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు||
జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను (2)
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||