లెక్కించలేని స్తోత్రముల్ Telugu Christian Songs Lyrics

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో(2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని(2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని(2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

లెక్కించలేని స్తోత్రముల్ Jesus Songs Lyrics in Telugu


లెక్కించలేని స్తోత్రముల్ Telugu Christian Songs Lyrics