లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక – (2)
జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)
పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి – (2)
వెలుగై యుందురనె యేసుండు ॥లోకమంతట॥
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు – (2)
ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోకమంతట॥