నా తండ్రీ నిను నేను మరువలేను
యేసయ్య నా చేయి పట్టి నడుపయ్య
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం
ఘనుడా నిను బట్టియే నాకు ఈ స్థానం
ఏముంది నాలో నను ఆశీర్వదించుటకు
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం
నా ప్రార్ధనలన్ని నేరవేర్చుదేవా
నా ఆశలన్ని తీర్చేటి ప్రభువా
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం
నా సరిహద్దులన్నీ విశాల పరచుమా
నీ చేయి నాకు తోడుగా నుండనీ
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం