నేడో రేపో నా ప్రియుడేసు Telugu Christian Songs Lyrics

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||

చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో||

కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో||

నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||

నేడో రేపో నా ప్రియుడేసు Jesus Songs Lyrics in Telugu


నేడో రేపో నా ప్రియుడేసు Telugu Christian Songs Lyrics